డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తిని యువతి సోదరులు దారుణంగా హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం… వేములపల్లికి చెందిన పీవీవీ సూర్యప్రకాశరావు (41) స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ క్లాస్‌మేట్స్‌గా ఉండి, కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో యువతి కుటుంబ సభ్యులు ఈ సంబంధానికి వ్యతిరేకంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్న అనంతరం సంధ్యను సూర్యప్రకాశ్ తన ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు గురువారం అర్ధరాత్రి సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. బండరాయితో ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సూర్యప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలాన్ని మండపేట రూరల్ సీఐ, ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు చంద్రపాల్, గిరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















