ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామంలోని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడం ప్రతిరోజూ ఓ సవాల్‌గా మారింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
నిరాల గ్రామం నుంచి జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు సుమారు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకే విద్యార్థులు పుస్తకాల సంచులతో రోడ్డుపైకి చేరుకుంటున్నారు. అయితే బస్సులు వచ్చినా అవి ప్రయాణికులతో నిండిపోయి ఉండటంతో విద్యార్థులకు ఎక్కేందుకు అవకాశం దొరకడం లేదు.
మూడు గంటల వ్యవధిలో మూడు బస్సులు వచ్చినప్పటికీ అవన్నీ కిక్కిరిసిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. బస్సులో నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో చాలామంది విద్యార్థులు బస్సు ఎక్కలేక నిరాశతో తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో వారి చదువుపై ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు అందుబాటులో లేకపోతే తెలిసిన వారిని అడిగి ద్విచక్రవాహనాలపై పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. పరీక్షల సమయంలో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
నిరాల గ్రామానికి సరిపడా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులు నడపాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అధికారులు త్వరగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















