కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ మార్పులు జరిగితే, 2008 ఆర్థిక సంక్షోభం కంటే కూడా దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఆర్థిక సర్వే ప్రకారం, భారత్‌లో ఐటీ రంగం పెద్దఎత్తున ఉపాధిని అందిస్తోంది. అయితే ఏఐ ప్రవేశంతో కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను యంత్రాలే భర్తీ చేస్తున్నాయి. ఉద్యోగాలు ఒక్కసారిగా అంతరించిపోవు గానీ, ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయన్నది సర్వే సూచన. ఈ పరిణామాలు జరిగే అవకాశాలు 10 నుంచి 20 శాతం మాత్రమే ఉన్నా, ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపింది.

ఇప్పటివరకు విదేశీ సంస్థలకు భారత్ నుంచి తక్కువ ఖర్చుతో ఐటీ సేవలు అందుతుండగా, అదే పనిని ఏఐ వేగంగా, తక్కువ వ్యయంతో చేయగలుగుతుండటంతో ఈ రంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఉద్యోగాలను రక్షించేందుకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలంటే ‘ఏఐ ఎకనామిక్ కౌన్సిల్’ ఏర్పాటు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















