కృత్రిమ మేధ (AI) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో భారీ మార్పులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని తాజా అంతర్జాతీయ సర్వే హెచ్చరించింది.
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్–ఆలీవర్ వైమన్ ఫోరమ్ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 415 మంది సీఈఓల అభిప్రాయాలను సేకరించారు. ఈ నివేదిక ప్రకారం, సగం మంది సీఈఓలు ఇకపై ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల నియామకాలపై ఆసక్తి చూపడం లేదని వెల్లడైంది.ఇప్పటికే AI కోడ్ రాయడం, డాక్యుమెంట్లు విశ్లేషించడం, రిపోర్టులు తయారు చేయడం, కస్టమర్ సపోర్ట్ వంటి పనులను వేగంగా నిర్వహిస్తోంది. దీంతో కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడం తగ్గించి, అనుభవజ్ఞులైన ఉద్యోగులపై దృష్టి పెడుతున్నాయి.
ప్రస్తుతం ఐఐటీలు, టెక్ ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా లభించే ఈజీ జాబ్స్ భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాధారణ సాఫ్ట్‌వేర్, డేటా, సపోర్ట్ సంబంధిత పనులను AI భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే AI అన్ని పనులను పూర్తిగా భర్తీ చేయలేదని సర్వే పేర్కొంది. సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, మానవ అనుభవం ఆధారిత ఆలోచనల విషయంలో AI ఇంకా పరిమితంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే AI పనితీరును పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన ఉద్యోగుల అవసరం పెరుగుతోందని సర్వే వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















