గుంటూరు నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన భారీ పైపులు మంటలకు ఆహుతయ్యాయి.
సమాచారం ప్రకారం, గుంటూరులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిర్మాణ సంస్థ పదేళ్ల క్రితం పెద్ద ఎత్తున పైపులను ఖాళీ ప్రదేశంలో నిల్వ చేసింది. అయితే కోర్టు కేసుల కారణంగా పనులు నిలిచిపోవడంతో పైపులు అక్కడే నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. నిర్వహణ లేకపోవడంతో పైపుల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదంగా మారాయి. పైపులు దగ్ధమవుతూ దట్టమైన నల్లపొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు.మంటల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















