కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ టూల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఏఐ వినియోగం తప్పనిసరి అవుతుండటంతో నిపుణుల డిమాండ్ పెరుగుతోంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ 2025లో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్ కలిసి స్థాపించిన ‘వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్’ సంస్థ అమెరికాలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ సంస్థ ఒక్క క్లాస్‌కు సుమారు 25,000 డాలర్లు (దాదాపు రూ.23 లక్షలు) వసూలు చేస్తోంది.
సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి పెద్ద ఆర్థిక సంస్థలు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఉద్యోగులకు చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించి రోజువారీ ఆర్థిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ ఇస్తున్నారు.
నిపుణుల ప్రకారం, చాలామంది బ్యాంకర్లకు ఇప్పటికీ ఏఐ టూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్ల పాత విధానాలనే అనుసరిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించడానికి భారీగా ఏఐ ట్రైనింగ్ అవసరం పెరుగుతోంది.అయితే మరోవైపు, ఏఐ ప్రభావంతో ఫైనాన్స్ రంగంలో కూడా ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. కొన్ని పెద్ద బ్యాంకులు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాయి. అయినప్పటికీ ఏఐను సమర్థవంతంగా ఉపయోగించగల నైపుణ్యం భవిష్యత్‌లో అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















