హరియాణా సంగీత ప్రపంచంలో తనదైన పాటలు, డిజిటల్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, గాయకుడు అంకిత్ బాల్యన్ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్ నుంచి బయటకు వస్తున్న అంకిత్‌పై దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. సుమారు 18 రౌండ్ల కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. అంకిత్ హత్య తమ పనేనంటూ ‘జితేందర్ మన్ గోగి గ్యాంగ్’ పేరుతో సంబంధం ఉన్న ఖాతా నుంచి ప్రకటన వెలువడినట్లు సమాచారం. ‘భోలూ సహాపురియా’ పేరుతో ఉన్న ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసినట్లు తెలుస్తోంది.
అంకిత్ బాల్యన్ గతంలో రూపొందించిన ‘కోర్ట్ మే గోలీ’ పాటను గ్యాంగ్ హత్యకు కారణంగా పేర్కొన్నట్లు సమాచారం. 2021లో దిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని ప్రత్యర్థులు కాల్చి చంపిన ఘటన ఆధారంగా ఈ పాట రూపొందించినట్లు తెలుస్తోంది. తమ ప్రత్యర్థులకు అనుకూలంగా అంకిత్ ఈ పాటను రూపొందించారని గ్యాంగ్ ఆరోపించినట్లు సమాచారం.
తమకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోస్టు నిజంగా సంబంధిత గ్యాంగ్ నుంచే వచ్చిందా? అంకిత్ హత్యకు అదే కారణమా? అనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.
అంకిత్ హత్యతో హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ సంగీత వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు, బహిరంగంగా హత్యకు బాధ్యత ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు వెలువడటం భద్రతా వ్యవస్థపైనా పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















