రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పెట్టుబడులు, మౌలికవసతులు, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పోర్టుల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మూలపేట పోర్టుకు సంబంధించిన పునరావాస పనులు, డ్రెడ్జింగ్, ఉప్పు భూముల సమస్యలు, రోడ్డు మరియు రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. మచిలీపట్నం పోర్టుకు రైల్వే కనెక్టివిటీ, విద్యుత్, మంచినీటి సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని, బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్ పనులు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. రామాయపట్నం పోర్టులో కూడా డ్రెడ్జింగ్, పునరావాస సమస్యలు త్వరగా పరిష్కరించాలని సూచించారు.
అదేవిధంగా రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















