దేశీయ మదుపర్లకు అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి అవకాశాలు మరింత సులభమయ్యాయి. National Stock Exchange అనుబంధ సంస్థ అయిన NSE International Exchange (NSE IX) గ్లోబల్ ట్రేడ్ యాక్సెస్ ప్లాట్‌ఫాం ద్వారా అమెరికా స్టాక్ మార్కెట్ షేర్లలో నేరుగా ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించింది. తొలి దశలో అమెరికా మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చిన ఈ వేదిక, వచ్చే ఆరు నెలల్లో 30కి పైగా దేశాల మార్కెట్లకు విస్తరApple Inc., Microsoft, Nvidia వంటి దిగ్గజ కంపెనీల షేర్లను భారత మదుపర్లు నేరుగా కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా ఫ్రాక్షనల్ ట్రేడింగ్ సౌకర్యం ఉండటం వల్ల పూర్తిస్థాయి షేరు కొనాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు యాపిల్ షేరు ధర 272 డాలర్ల పరిధిలో ఉన్నా, కేవలం 5 డాలర్లతోనూ షేరు యొక్క ఒక భాగాన్ని కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి చేసిన మొత్తానికి అనుగుణంగా షేరు భాగం మీ ఖాతాలో జమ అవుతుంది
డాలర్లలో పెట్టుబడి… సులభమైన ప్రక్రియ
పెట్టుబడులు డాలర్లలోనే జరుగుతాయి. ముందుగా రూపాయలను డాలర్లుగా మారుస్తారు. వెబ్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ సేవలను వినియోగించవచ్చు. ఒకసారి యాప్‌లో డబ్బులు జమైతే, వెంటనే కొనుగోలు–అమ్మకాలు ప్రారంభించవచ్చు.
30–45 సెకన్లలో డిజిటల్ KYC
ఆన్‌లైన్ డిజిటల్ KYC ప్రక్రియ కేవలం 30–45 సెకన్లలో పూర్తవుతుంది. ఆధార్ ధృవీకరణ, పాన్ కార్డు, డిజిలాకర్ ద్వారా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చు. అనంతరం గిఫ్ట్ సిటీ బ్యాంకు ఖాతాను ట్రేడింగ్ ప్లాట్‌ఫాంకు అనుసంధానం చేయాలి. ముఖ్యంగా, ఈ ప్లాట్‌ఫాంపై ట్రేడింగ్ చేయడానికి ప్రత్యేక డీమ్యాట్ ఖాతా అవసరం లేదు.
ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?
Reserve Bank of India అమలు చేస్తున్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత మదుపరి 2,50,000 డాలర్ల (సుమారు రూ.2.25 కోట్ల) వరకు విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈక్విటీలు, ETFలు కొనుగోలు చేయవచ్చు. అయితే డెరివేటివ్స్, డిజిటల్ అసెట్ ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో లేవు.
.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















