బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో భర్త, నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులను అభినందన్, ఆయన నాలుగేళ్ల కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరిదీ హత్యేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అభినందన్ తన భార్య హరిణి, నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఉత్తర బెంగళూరులోని చిక్కబాణవారలో నివసించేవారు. సోమవారం అభినందన్, ఆయన కుమారుడు మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక దర్యాప్తులో.. ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య నిద్రించే విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో హరిణి తన భర్తపై గరిటెతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రించినట్లు సమాచారం.
ఆ తర్వాత హరిణి తనకు పరిచయమున్న వినయ్‌ను ఇంటికి పిలిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ కలిసి అభినందన్‌పై దాడి చేసి, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలో నాలుగేళ్ల బాలుడు మేల్కొనడంతో.. అతడిని కూడా దిండు ఉపయోగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి హరిణిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హరిణి ప్రియుడిగా అనుమానిస్తున్న వినయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఫిర్యాదులోని ఆరోపణలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసులో మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















