స్మార్ట్‌వాచ్‌లు, వేరెబుల్స్ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ సంస్థ బోల్ట్ తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బోల్ట్ బ్రాండ్ కింద ACE 5G, EVO 4G పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో పలు సంస్థలు స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచుతున్న సమయంలో.. బోల్ట్ మాత్రం అందుబాటు ధరలను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను తీసుకురావడం విశేషం.
రెండు మోడళ్లలోనూ 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
బోల్ట్ ACE 5Gలో 6.79 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో UniSoC T8200 ప్రాసెసర్‌ను అమర్చారు.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 64MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6000mAh బ్యాటరీకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టోరేజీని 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. గూగుల్ జెమినై, వివిధ AI ఫీచర్లను కూడా ఇందులో అందించారు.
ACE 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4GB+128GB ధర రూ.12,999, 6GB+128GB ధర రూ.13,999, 8GB+128GB ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది.
బోల్ట్ EVO 4Gలో కూడా 6.79 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 6000mAh బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు.
ఈ ఫోన్‌లో UniSoC T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్ పనిచేస్తుంది. వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
EVO రెండు వేరియంట్లలో వస్తోంది. 4GB+64GB ధర రూ.9,999, 6GB+128GB ధర రూ.10,999గా నిర్ణయించారు.
ACE 5G, EVO 4G స్మార్ట్‌ఫోన్లు ఆర్కిటిక్ వైట్, బెర్రీ రెడ్, లావెండర్ బ్లూమ్, మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో లభించనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















