బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), దిల్లీ పలు విభాగాల్లో మొత్తం 899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ అర్హతలతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతాయి.
ముఖ్యంగా స్టోర్ కీపర్ టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఆపరేటర్ ఎక్స్‌కవేటింగ్ మెషినరీ, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి నెలకు రూ.27,300 నుంచి రూ.28,200 వరకు వేతనం అందించనున్నారు.
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆబ్జెక్టివ్ లేదా సబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అనంతరం శారీరక సామర్థ్య పరీక్షలో 1.6 కి.మీ పరుగును 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ట్రేడ్ టెస్ట్‌లో కనీసం 40 శాతం మార్కులు పొందాలి.
అభ్యర్థుల శారీరక ప్రమాణాల్లో ఎత్తు 157 సెం.మీ., చాతీ 75 సెం.మీ. (5 సెం.మీ. విస్తరణతో), బరువు కనీసం 50 కిలోలు ఉండాలి. వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి. చివరి తేదీ 04.07.2026.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















