గుజరాత్‌లోని భావ్‌నగర్ రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ఓ ఒంటెను రైల్వే సిబ్బంది, స్థానికులు కలిసి సురక్షితంగా కాపాడారు.
వాంజలియా – రాణావవ్ రైల్వే మార్గంలోని ఓ బ్రిడ్జిపై ట్రాక్ మధ్యలో ఒంటె చిక్కుకుపోయింది. ఆ సమయంలో సౌరాష్ట్ర – పోర్‌బందర్ మధ్య నడుస్తున్న సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ ట్రాక్‌పై ఉన్న ఒంటెను గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు.
ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముంబై – రాజ్‌కోట్ మార్గంలో నడిచే పలు రైళ్లపై ప్రభావం పడింది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని జేసీబీ, స్థానికుల సహాయంతో ఒంటెను ట్రాక్ నుంచి సురక్షితంగా పక్కకు తరలించారు. అనంతరం రైల్వే మార్గాన్ని పరిశీలించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటన కారణంగా పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం చోటుచేసుకుంది. పోర్‌బందర్ – సౌరాష్ట్ర, పోర్‌బందర్ – రాజ్‌కోట్, పోర్‌బందర్ – భావ్‌నగర్ రైళ్లపై ప్రభావం పడింది.
ఒంటె ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో స్పందించిన లోకో పైలట్, రైల్వే అధికారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూగజీవి ప్రాణాన్ని కాపాడిన వారి చర్య మానవత్వానికి నిదర్శనమంటూ అభినందిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















