ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల కోసం కేంద్రం మరోసారి సురక్షిత సూచనలు (Advisory) జారీ చేసింది. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం సోషల్ మీడియా ద్వారా ఎక్స్‌లో పోస్టు చేసింది.
భారత పౌరులను రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రాకూడదని హెచ్చరించింది. అలాగే సహాయహెల్ప్‌లైన్ నంబర్లు మరియు ఈ-మెయిల్ వివరాలను కూడా షేర్ చేసింది:
ఫోన్: +989128109115, +989128109109, +989128109102, +989932179359
ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకారం అయిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ కావడం గమనార్హం. నిన్న రాత్రి కూడా కేంద్ర విదేశాంగశాఖా (MEA) మరో అడ్వైజరీ జారీ చేసింది.అందులో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇళ్లలోనే ఉండాలని, విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల నుండి దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులను విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం యుద్ధం తాత్కాలికంగా ఆగడంతో, స్వదేశానికి రాలనుకునేవారికి ఇది ఒక సురక్షిత అవకాశం అవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















