ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
గతేడాది సెప్టెంబర్ 9న కనకదుర్గ ఫైనాన్స్ హెడ్ ఆఫీస్ నుంచి ఆడిట్ కోసం వచ్చిన ఆడిటర్ వడ్లమూడి ఉమామహేశ్, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి లాకర్లలోని మొత్తం బంగారాన్ని బయటకు తీయించి ఆడిట్ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ బయటకు వెళ్లిన సమయంలో, క్యాషియర్‌ను కూడా కొబ్బరినీళ్ల నెపంతో బయటకు పంపి, ముందుగా తెచ్చుకున్న బ్యాగులో 378 కవర్లలో ఉన్న 4.490 కేజీల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు.
కనకదుర్గ ఫైనాన్స్ శాఖ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఐటీ మరియు సైబర్ సెల్ సాయంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసు ఛేదనలో పోలీసుల చాకచక్యం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















