కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో వెళ్తున్న కంటైనర్ మలుపు తిరుగుతున్న సమయంలో, కోల్‌కతా నుంచి చెన్నైకి కాటన్ వేస్ట్ బండిల్స్‌తో వస్తున్న మరో కంటైనర్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.
ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి, ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ (43) సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
మృతుడు కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి, ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ (43) సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews