శరీరంలో వచ్చే చిన్న మార్పులనూ గమనించి నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, గతంలో తన స్నేహితుడు ఒకరు క్యాన్సర్ బారిన పడినప్పటికీ ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడంతో పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. “నాకు క్యాన్సర్ రాదులే” అని నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవనశైలి, అలవాట్లు, వాతావరణం, వంశపారంపర్య కారణాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే 90 శాతం వరకు నియంత్రించుకునే అవకాశం ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్లు వేయిస్తే కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చని తెలిపారు. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండి, అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు.
అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు షార్ట్ ఫిల్మ్స్ రూపొందించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, అది తన బాధ్యతగా భావిస్తున్నానని చిరంజీవి చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ ఈ మహమ్మారిని కలిసి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















