అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు. డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాల అమలు, పరిశ్రమల అనుమతుల సరళీకరణ, పరిపాలనా వేగం పెంపుపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం అనవసర నిబంధనలు, పర్మిషన్లను తగ్గించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 800కు పైగా నిబంధనలను 100లోపుకు తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే లైసెన్సింగ్ వ్యవస్థను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని సూచించారు.
అనుమతుల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చాలని, దరఖాస్తు నుంచి అనుమతి వరకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దీంతో పారదర్శకత పెరగడంతో పాటు పరిశ్రమల స్థాపన వేగం గణనీయంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















