అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకం సాధించి ముందుండగా, కేఎల్ రాహుల్ కూడా అద్భుత సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేశారు. మధ్యవరుసలో Rishabh Pant (81), Sai Sudharsan (81), Washington Sundar (52*) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అయితే మరోసారి 80ల వద్ద ఔట్ అయిన పంత్‌పై మాజీ స్పిన్నర్ Ravichandran Ashwin ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ దూకుడైన బ్యాటింగ్ జట్టుకు ఎంతో ఉపయోగకరమని, కానీ 80లు, 90ల్లోకి వచ్చిన తర్వాత కాస్త ఆత్మపరిశీలనతో ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
50 టెస్టులు ఆడిన పంత్ ఖాతాలో ఇప్పటివరకు 8 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. మరో ఎనిమిదిసార్లు శతకానికి చేరువలోనే వికెట్ కోల్పోయాడు. “ఇంకా 15–20 పరుగులు చేయగలిగే పరిస్థితుల్లో కూడా రిస్కీ షాట్లు ఆడటం ఆశ్చర్యంగా ఉంటుంది. సెంచరీలను పెద్ద ఇన్నింగ్స్‌లుగా మలచగలిగితే అతడి గణాంకాలు మరింత మెరుగ్గా ఉండేవి” అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
అశ్విన్ మాటల్లో, పంత్‌లో అసాధారణ ప్రతిభ ఉన్నప్పటికీ, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మలచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో ఓర్పు, స్థిరత్వం కీలకం. ఇప్పటికే అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఎదిగిన పంత్, ఇకనైనా జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడితే భారత జట్టుకు మరింత బలంగా మారగలడని ఆయన సూచించాడు.
టీమిండియా విజయాల్లో పంత్ పాత్ర అనసూయ్యమే అయినప్పటికీ, అతడి ఇన్నింగ్స్‌లు తరచూ సెంచరీలుగా మారితే మ్యాచ్‌లపై ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















