ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకోవడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించిన అనంతరం, ఆ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన గస్ అట్కిన్సన్‌తో కలిసి స్టోక్స్ నైట్‌క్లబ్‌కు వెళ్లినట్లు సమాచారం.
అక్కడ మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో క్రికెటర్లకు గాయాలు కాలేదుగానీ, అక్కడ విధుల్లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఘటనపై ఈసీబీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. అంతేకాకుండా స్టోక్స్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించినట్లు సమాచారం. మిగతా సిరీస్‌లో స్టోక్స్, అట్కిన్సన్‌లను కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఈసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
టెస్టు ఫార్మాట్‌కే పరిమితమైన స్టోక్స్ కెరీర్‌పై కూడా ఈ వివాదం ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా మద్యం కారణంగా అతడు వివాదాల్లో చిక్కుకున్న ఘటనలు ఉన్నాయి. 2013లో సిరీస్ నుంచి మధ్యలోనే తప్పించబడ్డాడు. 2017లో బ్రిస్టల్ నైట్‌క్లబ్ ఘటనలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నా, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రస్తుతం ఈ తాజా ఘటనతో స్టోక్స్ భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















