కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పారా అథ్లెటిక్స్‌లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకంతో మెరవగా.. అదే విభాగంలో మహ్మద్ బసిల్ రజతం సాధించి భారత్‌కు డబుల్ ధమాకా అందించారు.
పురుషుల పారా 100 మీటర్ల టీ47 విభాగంలో దిలీప్ గావిత్ కేవలం 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ మహ్మద్ బసిల్ 10.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ సాంటోస్ కాంస్యం సాధించాడు.
మరోవైపు పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ 8.09 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం గెలిచాడు. దీంతో వరుసగా రెండు కామన్వెల్త్ క్రీడల్లో లాంగ్‌జంప్ పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్‌లోనూ అతడు రజతం సాధించాడు. 2024లో మోకాలి గాయంతో కెరీర్ సవాల్‌గా మారినప్పటికీ.. పట్టుదలతో తిరిగి పుంజుకుని మరోసారి పతకం సాధించడం విశేషం.
ఇక భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్‌లో 79.61 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ కూడా ఫైనల్‌కు చేరడంతో జావెలిన్ త్రోలో భారత్ పతకంపై భారీ ఆశలు పెట్టుకుంది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ 110+ కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. స్నాచ్‌లో 176 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 212 కేజీలు కలిపి మొత్తం 388 కేజీలు ఎత్తాడు. కేవలం ఒక్క కేజీ తేడాతో స్వర్ణం చేజారింది.
ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు ఫైనల్‌కు అర్హత సాధించగా.. లాన్ బౌల్స్‌లో నవ్‌నీత్‌సింగ్, దినేశ్ కుమార్ జంట వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలిసారి కామన్వెల్త్‌లో పాల్గొన్న 18 ఏళ్ల మార్టినా దేవి ఐదో స్థానంతో పోటీని ముగించింది.
మొత్తంగా అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటడంతో కామన్వెల్త్ క్రీడల్లో దేశ పతకాల సంఖ్య మరింత పెరుగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















