నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.354 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో బాలాలయ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభానికి అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు.
ప్రస్తుతం ఉన్న రూ.150 అక్షరాభ్యాస మండపంలో బాలాలయం ఏర్పాటు చేసి వచ్చే నెల 5న అమ్మవారి ప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు 3, 4 తేదీల్లో శృంగేరి పీఠాధిపతి శిష్యులు బాసరకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అదే సమయంలో రూ.1000 ప్రత్యేక అక్షరాభ్యాస కార్యక్రమాలకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.150 అక్షరాభ్యాసాలను పాత ఈఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆర్కిటెక్ట్ అధికారి మాధవి, స్థపతి మోతిలాల్ వారం క్రితం స్థల పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయగా, బాలాలయ ఏర్పాటుకు అనుమతి లభించినట్లు సమాచారం. చిన్న ఆలయ నిర్మాణ శైలిలో బాలాలయాన్ని ఏర్పాటు చేసి సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవి, మహంకాళి అమ్మవార్లకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
ప్రత్యేక పూజల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు ప్రస్తుత ఆలయంలో వ్యాసమహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలంగా భావిస్తున్నందున అక్కడ నిత్య పూజలు కొనసాగించాల్సిందిగా పీఠాధిపతి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















