CV Anand Sajjanar దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ యాప్ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలు చెప్పిన విషయాలను వెంటనే టెక్ట్స్‌గా మార్చి అనువదించే సదుపాయం ఇందులో ఉండటంతో ఫిర్యాదు నమోదు ప్రక్రియ మరింత సులభమవుతుందని పేర్కొన్నారు.
ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అయ్యే విధంగా యాప్‌ను రూపొందించామని చెప్పారు. ముఖ్యంగా వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. భాష కారణంగా ఎవరికీ న్యాయం దూరం కాకూడదనే లక్ష్యంతో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
తొలుత హైదరాబాద్ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతంగా, కచ్చితత్వంతో పూర్తి చేయడంలో ఈ యాప్ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. BlueCloud Softech Solutions సహకారంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















