విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ఎప్పుడూ ఏ బౌలర్‌కైనా పెద్ద సవాలే. ముఖ్యంగా ఛేజింగ్‌లో అతన్ని పెవిలియన్‌కు పంపడం మరింత కష్టం. అయితే సకిబ్ హుసేన్ ఈసారి తన తొలి ఓవర్‌లోనే కోహ్లీ వికెట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్లో బంతులతో అతన్ని ఇబ్బంది పెట్టి కీలక బ్రేక్‌థ్రూ సాధించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సకిబ్ హుసేన్ మాట్లాడుతూ, “కొత్తగా పెద్ద ప్లాన్లు ఏమీ లేవు. బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ చెప్పిన సూచనలు మాత్రమే పాటించా. పిచ్‌ను బాగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు బౌలింగ్‌లో మార్పులు చేసుకున్నా. గ్రిప్ బాగుండటంతో స్లో బంతులపై దృష్టి పెట్టా. అది వర్కౌట్ అయింది. కోహ్లీ వికెట్ తీసినప్పుడు చాలా ఎంజాయ్ చేశా. అది నా డ్రీమ్ వికెట్,” అని తెలిపాడు.
అతను ఇంకా మాట్లాడుతూ, ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ ప్లాన్ చేస్తానని, జట్టుకు ఉపయోగపడితే అదే తనకు పెద్ద ఆనందమని చెప్పాడు. ప్రస్తుతం జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నందున వంద శాతం శ్రమించి టైటిల్ గెలవడమే లక్ష్యమని పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో Sunrisers Hyderabad ప్రదర్శన కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఆ జట్టు మొత్తం 12 మ్యాచ్‌ల్లో 220+ లక్ష్యాలను కాపాడుకొని విజయాలు సాధించడం గమనార్హం. ఒక సీజన్‌లో 200+ స్కోర్లు అత్యధికంగా నమోదు చేసిన జట్టుగా కూడా సన్‌రైజర్స్ నిలిచింది.
ఆర్సీబీపై 55 పరుగుల భారీ విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్లు 47 బంతుల్లో కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రదర్శనతో జట్టు బౌలింగ్ యూనిట్ ప్రభావవంతంగా పనిచేసిందని స్పష్టమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















