సైబర్ నేరాల నియంత్రణ, కట్టడి లక్ష్యంగా *హైదరాబాద్*లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘షీల్డ్ 2.0’ సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.‘బాధితులకు రక్షణ – డిజిటల్ భవిష్యత్తుకు భద్రత’ అనే నినాదంతో సాగిన ఈ సదస్సులో, ఏఐ ఆధారిత పోలీసు వ్యవస్థపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు పాల్గొని, సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతికత వినియోగంపై తమ అనుభవాలను పంచుకున్నారు.
సదస్సులో భాగంగా ఏఐ రోబోలను ప్రదర్శించగా, రోబో చేసిన విన్యాసాలు, డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైబర్ నేరాల గుర్తింపు, బాధితులకు వేగవంతమైన సహాయం, డేటా విశ్లేషణలో ఏఐ పాత్రపై అధికారులు వివరించారు.
డిజిటల్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా షీల్డ్ 2.0 సదస్సు కీలక వేదికగా నిలిచిందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















