దేశీయ విమానయాన రంగంలో ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు చెందిన పైలట్లకు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం కుదుపులకు గురైన ఘటన నేపథ్యంలో విమాన భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీనికి తోడు ఎయిరిండియాకు చెందిన మరో ఇద్దరు పైలట్లు డ్రగ్ పరీక్షల్లో విఫలమైనట్లు సమాచారం. దీంతో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తమ పైలట్లందరికీ డ్రగ్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేశాయి.
ఇదే విధానాన్ని దేశంలోని ఇతర విమానయాన సంస్థలకు కూడా వర్తింపజేసే దిశగా డీజీసీఏ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పైలట్లలో సైకోయాక్టివ్ పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షా విధానాన్ని రూపొందించే అవకాశం ఉంది.
ఇందుకోసం డోపింగ్ పరీక్షలకు సంబంధించిన సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ (సీఏఆర్), ఇతర నిబంధనల్లో మార్పులు చేసే అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్ని విమానయాన సంస్థల్లో ఒకే విధమైన స్క్రీనింగ్ విధానం అమలు చేసేలా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనున్నారు.
అయితే ఈ అంశంపై డీజీసీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే దేశీయ విమానయాన రంగంలో పైలట్ల భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















