దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. అధిక బరువు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కీళ్లు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరగటంతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు, కీళ్లవాపు, సంతానలేమి, కొన్ని రకాల క్యాన్సర్లకు ఊబకాయం దోహదం చేస్తుంది.
అందువల్ల బరువు తగ్గటాన్ని కేవలం అందం, శరీరాకృతి కోణంలో చూడకూడదు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునే ప్రక్రియగా భావించాలి. శరీర బరువులో 5-10 శాతం తగ్గినా ఆరోగ్యపరంగా గణనీయమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజు స్థాయులు, కొలెస్ట్రాల్ వంటి జీవక్రియల సూచికలు మెరుగుపడటంతో పాటు రక్తపోటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరంలోని పలు అవయవాల పనితీరుపైనా సానుకూల ప్రభావం పడుతుంది.
అయితే ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గాలనే లక్ష్యంతో కఠినమైన ఆహార నియమాలు పాటించటం లేదా అతిగా వ్యాయామం చేయటం సరైన విధానం కాదు. బరువు తగ్గటానికి వాస్తవికమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. నెమ్మదిగా తగ్గిన బరువును దీర్ఘకాలం కొనసాగించటం సాధారణంగా మరింత ప్రయోజనకరం. తగ్గిన బరువు తిరిగి పెరగకుండా నిరంతరం పర్యవేక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం.
నామోషీ పడాల్సిన అవసరం లేదు
‘అయ్యో.. బరువు ఎక్కువగా ఉందే’ అంటూ కొందరు నామోషీకి గురవుతుంటారు. తమ రూపం గురించి దిగులు చెందుతూ, ఇతరులను కలవడానికి కూడా వెనకాడుతుంటారు.దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. అధిక బరువు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కీళ్లు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరగటంతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు, కీళ్లవాపు, సంతానలేమి, కొన్ని రకాల క్యాన్సర్లకు ఊబకాయం దోహదం చేస్తుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















