అనగనగా ఒక చిన్న ఊరిలో ఓ రైతు ఉండేవాడు. ఒకసారి అతను ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ వడ్డించిన కాకరకాయ ఉల్లికారం కూర తిన్నాడు. చేదుగా ఉండే కాకరకాయ అంత రుచిగా ఉంటుందని అతనికి అప్పటివరకు తెలియదు. ఆ రుచి అతని మనసులో నాటుకుపోయింది.
ఆ కాలంలో కాకరకాయలు సులభంగా దొరికేవి కాదు. కాబట్టి ఎంతో కష్టపడి విత్తనాలు సంపాదించి, జాగ్రత్తగా వాటిని నాటి, నీరు పోసి, ముళ్ళు తగలకుండా కాపాడుకుంటూ పెంచాడు. రోజూ వాటిని చూస్తూ “ఎప్పుడెప్పుడు పండుతాయా?” అని ఎదురు చూశాడు. చివరకు మూడు అందమైన కాకరకాయలు పండాయి. అవి అతనికి బంగారం లాంటివే!
ఆనందంగా కోసుకుని ఇంటికి తీసుకొచ్చి తన భార్యకు ఇచ్చాడు.
“ఇవి ఉల్లిపాయ, ఖారం పెట్టి రుచిగా వండమ్మా!” అని చెప్పి పొలానికి వెళ్లిపోయాడు.రోజంతా పొలంలో పని చేస్తున్నా… అతని మనసు మాత్రం ఇంటి దగ్గరే.
నూనెలో భుసభుసలాడుతూ వేయిస్తున్న కాకరకాయల వాసన ఊహించుకుంటూ నోరూరించుకున్నాడు. “ఈ రోజు భోజనం భలే ఉంటుంది!” అని ఆనందపడ్డాడు.ఇంట్లో .. అతని భార్య బూరెల ముక్కుడులో నూనె వేసి, ఉల్లిపాయలు, మసాలా వేసి కాకరకాయలను వేయించింది. వాసన అంత మత్తెక్కించేలా ఉంది. కూర సిద్ధమయ్యాక చూడలేక
“రుచి చూసేద్దాం…” అని ఒకటి తిన్నది.
కొంతసేపటికి ఆకలి వేసి, “ఇది నా వంతు కదా…” అని రెండోది కూడా తినేసింది.సాయంత్రం రైతు ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చున్నాడు. భార్య ఒకే ఒక కాకరకాయ ముక్క వడ్డించింది.“ఇదేంటి? మిగతావి?” అని అడిగాడు. ఆమె సరదాగా, “ఒకటి రుచి చూసాను… రెండోది నా వంతు…” అంది.
రైతు కోపంగా, “అలా ఎలా తినేసావు?” అన్నాడు.ఆమె నవ్వుతూ,
“ఇలా!” అంటూ మూడో కాకరకాయను కూడా నోట్లో వేసుకుంది! అంతే… రైతు ఆశగా చూసిన కాకరకాయలు అన్నీ గల్లంతు!
నీతి:
కొన్ని వంటల రుచి అలాంటిది — ఒకసారి తింటే ఆగడం కష్టం!
కాకరకాయ చేదు అయినా… సరైన రీతిలో వండితే అమృతం అవుతుంది!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















