పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన Saudi Aramcoకు చెందిన రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌కు చెందిన షాహెద్-136 డ్రోన్‌తో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
దాడి అనంతరం రిఫైనరీ ప్రాంతంలో భారీ మంటలు చెలరేగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఘటన నేపథ్యంలో భద్రతా చర్యల భాగంగా రిఫైనరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా సౌదీ ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఈ పరిణామం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లపై వెంటనే ప్రభావం చూపింది. ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా దాడి మార్కెట్లను కుదిపేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లను దాటినట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాపై ఆంక్షలు, అంతరాయాలు ఏర్పడటంతో చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూలంగా గ్లోబల్ సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం. కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అదేవిధంగా దుబాయ్, దోహా, అబుదాబి, జెరూసలెం ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ సంఘటనలపై అధికారిక ధృవీకరణ పూర్తిగా అందుబాటులో లేదు.
సౌదీ అరేబియాలోని అరామ్‌కో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థల్లో ఒకటి కావడంతో ఈ దాడి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దేశాలు అప్రమత్తంగా ఉండగా, అంతర్జాతీయ సమాజం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















