దేశంలో ప్రాంతీయ విమానయాన సేవలను మరింత విస్తరించే దిశగా స్కైహాప్ ఏవియేషన్, నార్వేకు చెందిన నోమి ఏరోస్పేస్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు దక్షిణాసియాలో విద్యుత్ సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టే అవకాశాలపై సంయుక్తంగా అధ్యయనం చేయనున్నాయి.
2029-30 నాటికి కొనుగోలు లేదా లీజు విధానంలో నోమి ఏరోస్పేస్ నుంచి 10 విద్యుత్ సీప్లేన్లను తీసుకోవాలని స్కైహాప్ ప్రణాళిక రూపొందించింది. వాటి పనితీరును బట్టి భవిష్యత్తులో మరో ఐదు విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం 40 సీప్లేన్లను సమకూర్చుకోవాలని స్కైహాప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్, హైబ్రిడ్ సీప్లేన్లు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
భవిష్యత్తులో విద్యుత్, హైబ్రిడ్ సీప్లేన్లను భారత్లోనే తయారు చేయడం లేదా అసెంబ్లింగ్ చేసే అవకాశాలను కూడా ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. దీనివల్ల దేశీయ ప్రాంతీయ విమానయాన రంగంలో కొత్త సాంకేతికతకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
తొలి దశలో లక్షద్వీప్ దీవుల మధ్య రాకపోకలను మెరుగుపరచడంతో పాటు వాటిని ప్రధాన భూభాగంతో అనుసంధానించడంపై స్కైహాప్ దృష్టి సారించనుంది. ఇందుకోసం 19 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్న ట్విన్ ఒట్టర్ సీప్లేన్లను వినియోగించనున్నారు.
విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాని ప్రాంతాలకు సీప్లేన్లు ఉపయోగకరంగా ఉంటాయని స్కైహాప్ వ్యవస్థాపకురాలు, సీఈఓ అవని సింగ్ తెలిపారు. నీటిపై దిగడం, అక్కడి నుంచే ప్రయాణాన్ని కొనసాగించే సౌలభ్యం ఉండటంతో దీవులు, తీర ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు ఈ తరహా విమాన సేవలు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















