ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 50 కోట్లకు పైగా టికెట్ అభ్యర్థనలు వచ్చినట్లు ఫిఫా ప్రకటించింది. ఇది ఇప్పటివరకు ఏ క్రీడా ఈవెంట్‌కూ లేని భారీ డిమాండ్‌గా భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. న్యూజెర్సీలో జులై 19న జరగనున్న ఫైనల్ కోసం నాలుగు ప్రత్యేక సీట్లను ఫిఫా రీసేల్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ సీట్లు గోల్ వెనుక భాగంలోని లోయర్ డెక్‌లో బ్లాక్-124, రో-45లో ఉన్నాయి. వీటి ధర ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.21 కోట్లుగా నిర్ణయించారు.
అంతేకాదు, ఇతర ప్రీమియం టికెట్ కేటగిరీల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. టాప్ కేటగిరీ టికెట్ ధరను సుమారు 10,990 డాలర్లు (సుమారు రూ.10 లక్షల పైగా)గా ఫిఫా పేర్కొంది. ఈ భారీ ధరలపై క్రీడాభిమానుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఫిఫా తెలిపిన ప్రకారం, ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని తన 211 సభ్య దేశాల్లో ఫుట్‌బాల్ అభివృద్ధికి తిరిగి పెట్టుబడిగా ఉపయోగించనుంది.మొత్తంగా 48 దేశాలు పాల్గొనే ఈ వరల్డ్ కప్‌లో 104 మ్యాచ్‌లు 16 వేదికల్లో జరగనున్నాయి. ఇది ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద ప్రపంచకప్‌గా నిలవనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















