పాతబస్తీలో “గోల్డ్‌మ్యాన్”గా పేరుపొందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదైంది. తక్కువ ధరకు విదేశీ బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుల ఫిర్యాదు ప్రకారం, సీఎం రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సన్నిహితుడినంటూ సూర్యాభాయ్ వారిని నమ్మించినట్లు తెలిపారు. అయితే బంగారం ఇవ్వకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.
తర్వాత బాధితులు అతని ఇంటికి వెళ్లి నిలదీయగా, 3 ఐఫోన్లు, రూ.20 లక్షల చెక్ ఇచ్చి పంపించాడని తెలిపారు. అనంతరం ఆ ఫోన్లు కూడా తిరిగి తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసును తదుపరి విచారణ కోసం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















