బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాలనుకున్న భారీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ వైదొలిగినట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రణ్‌వీర్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) సోమవారం అధికారికంగా ప్రకటించింది.
సంస్థ విడుదల చేసిన ప్రకటనలో, ‘డాన్ 3’ నుంచి అనూహ్యంగా తప్పుకున్న కారణంగా రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధించినట్లు పేర్కొంది. అలాగే నిర్మాణ సంస్థతో ఉన్న వివాదం, ముఖ్యంగా రూ.45 కోట్ల ప్రీ-ప్రొడక్షన్ నష్టపరిహారం విషయంలో సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపింది. ఈ వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆయనతో ఎటువంటి సహకారం చేయవద్దని సినీ పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది.
రణ్‌వీర్ సింగ్ చర్చలకు సహకరించలేదని, ఒప్పంద విషయాల్లో స్పష్టత ఇవ్వలేదని కూడా ఫెడరేషన్ ఆరోపించింది. ఈ పరిస్థితి నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం కలిగించిందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంకా, మొత్తం సినీ పరిశ్రమ ఒక పెద్ద కుటుంబంలా పనిచేస్తుందని, ప్రతి విభాగం సమన్వయంతోనే సినిమా విజయవంతమవుతుందని FWICE అభిప్రాయపడింది. ముఖ్యమైన దశల్లో సీనియర్ నటులు ప్రాజెక్ట్‌ల నుంచి వైదొలగడం పరిశ్రమ స్థిరత్వానికి, పని వాతావరణానికి తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా హెచ్చరించింది.
అయితే ప్రస్తుతం సహాయ నిరాకరణ ఆదేశం ఉన్నప్పటికీ, ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఫెడరేషన్ స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















