మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిదారుల ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండా యూనిట్లు బదిలీ (డెబిట్) కాకుండా నిరోధించేందుకు ‘స్వచ్ఛంద డెబిట్ ఫ్రీజ్’ అనే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానుంది.
ఈ సదుపాయం ద్వారా పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను లాక్ చేసుకునే అవకాశం పొందుతారు. ఒకసారి ఫోలియోను లాక్ చేస్తే, యూనిట్లు డెబిట్ కావడం లేదా బదిలీ కావడం జరగదు. అవసరమైతే పెట్టుబడిదారులు ఎప్పుడైనా తిరిగి ఖాతాను అన్‌లాక్ చేసి లావాదేవీలు కొనసాగించవచ్చు అని సెబీ తెలిపింది.
డీమ్యాట్ మరియు నాన్ డీమ్యాట్ ఖాతాలకు వర్తింపు
ఈ సదుపాయం డీమ్యాట్ ఖాతాలతో పాటు డీమ్యాట్‌లో లేని ఫోలియోలకూ వర్తిస్తుంది. తొలి దశలో భాగంగా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (RTA) మరియు ఎంఎఫ్ సెంట్రల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు.
కేవైసీ పూర్తి అయిన ఖాతాలకు మాత్రమే
సెబీ తెలిపిన వివరాల ప్రకారం, కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే ఈ డెబిట్ ఫ్రీజ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా పెట్టుబడిదారుల ఖాతాల భద్రత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
త్వరలో యాంఫీ మార్గదర్శకాలు
ఈ కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (AMFI) త్వరలోనే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు) మరియు ఆర్‌టీఏలకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. లాక్‌లో ఉన్న ఖాతాల్లో ఏ ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అనుమతించాలి అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వనుంది.
అదే విధంగా, ఈ కొత్త సదుపాయం గురించి పూర్తి వివరాలను ఎఎంసీలు మరియు ఆర్‌టీఏలు తమ వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రకటించాలని సెబీ సూచించింది. ఈ చర్యతో పెట్టుబడిదారుల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు మరింత భద్రత కల్పించడమే కాకుండా, డిజిటల్ మోసాలను నివారించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















