కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ సంస్థ ఎన్‌బీసీసీ (NBCC) ఇండియా లిమిటెడ్ మొత్తం 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, డిప్లొమా, ఎంబీఏ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.
సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 10 పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి. నిర్మాణ రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం. ఎంటెక్ చేసిన అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం ఉంటే సరిపోతుంది. అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు లోపే ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు వేతనం లభిస్తుంది. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
జూనియర్ ఇంజినీర్ (సివిల్) – 20 పోస్టులు
ఈ పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగ అనుభవం అవసరం లేదు. అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. ఎంపికైన వారికి మూల వేతనం రూ.27,270. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఉంటుంది.
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 10 పోస్టులు
ఈ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా అర్హత. ఉద్యోగ అనుభవం అవసరం లేదు. అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు లోపే ఉండాలి. ఎంపికైన వారికి మూల వేతనం రూ.27,270. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది.
దరఖాస్తు వివరాలు:
ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.1000. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 05 ఏప్రిల్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















