కృష్ణాజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసాన్ని గుంతకల్లులో పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన భరతనాట్యాన్ని గిడుగు విశాలాక్షి వద్ద, కూచిపూడిని నటరాజ రామకృష్ణ వద్ద అభ్యసించారు. ఎ.ఆర్.కృష్ణ వద్ద నటనలో శిక్షణ పొందారు.
విద్యార్థి దశలోనే పలు నాటకాల్లో నటించి రంగస్థలంపై తన ప్రతిభను చాటుకున్నారు. ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’, ‘ప్రతాపరుద్రీయం’, ‘మంచుతెర’ వంటి నాటకాల్లో ఆయన నటించారు. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు ఆయనకు రంగస్థల మిత్రులు.
1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అనంతరం ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ జీవీ నారాయణరావు తనదైన ముద్ర వేశారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.
మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన జీవీ నారాయణరావుకు సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో మంచి స్నేహబంధం ఉంది. ఆయన మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. జీవీ నారాయణరావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















