ప్రేమలోని భావోద్వేగాలు, తీసుకునే నిర్ణయాలు జీవితంపై చూపించే ప్రభావాన్ని ప్రధానంగా చూపిస్తూ ‘సహ: లైఫ్ ఆఫ్ సంజు’ తెరకెక్కింది. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటించిన ఈ చిత్రానికి నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని చిత్రబృందం చెబుతోంది.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో శివ కుమార్ కాసారం మాట్లాడుతూ.. సినిమా ప్రేక్షకుల అంచనాలను కచ్చితంగా అందుకుంటుందని అన్నారు. ఒకవేళ సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే తనను నేరుగా సంప్రదించి ప్రశ్నించవచ్చని తెలిపారు. పెద్ద సినిమాలు విడుదలవుతున్న సమయంలో ‘సహ’ను థియేటర్లలోకి తీసుకురావడంపై కొందరు వద్దని సూచించినప్పటికీ.. పెద్ద సినిమాల మధ్య నిలబడి విజయం సాధిస్తేనే తమలాంటి కొత్తవారిని పరిశ్రమ గుర్తిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితానికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతుందని హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ అన్నారు. ప్రేమలోని ఆనందంతో పాటు బాధ, త్యాగం, భావోద్వేగాలను సినిమాలో చూపించినట్లు తెలిపారు. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత తప్పకుండా మెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్ సెంటర్‌లో గుండు కొట్టించుకుంటానంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















