నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే హీల్ ప్యారడైజ్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 11వ తరగతి (ఇంటర్‌మీడియట్) ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సీఈవో కె. అజయ్ కుమార్ తెలిపారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాసంస్థను డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ స్థాపించారు. ఇక్కడ విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు వసతి, భోజనం వంటి సౌకర్యాలు కూడా కల్పించబడుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ గ్రూపుల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రవేశ పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావాలి.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారై ఉండాలి. పదో తరగతిలో కనీసం 480 మార్కులు సాధించి ఉండాలి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు మరియు ఆదాయ ధృవపత్రం తప్పనిసరి. అర్హత ఉన్న విద్యార్థులు మే 18 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా అప్లై చేసే అవకాశం కల్పించారు.
అధిక సమాచారం కోసం సంస్థ వెబ్‌సైట్ లేదా ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.ఈ అర్హతలు ఉన్నవారు మే 18లోపు క్యూఆర్ కోడ్ లేదా https://tinyurl.com/Heal–Admission లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://healschool.org, info@healparadise.org వెబ్‌సైట్లు లేదా 9100024438, 9100024435 నంబర్లలో సంప్రదించవచ్చు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















