కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, గుడేకల్ గ్రామానికి చెందిన రామయ్య, నరసమ్మ (38) దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉండగా, పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది.
రామయ్య మద్యం అలవాటుకు బానిసై తరచూ భార్యను, కుమారుడిని వేధిస్తుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో విసుగు చెందిన నరసమ్మ పిల్లలతో కలిసి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది.
ఇదిలా ఉండగా, పెద్ద కుమార్తెకు ప్రసవం కావడంతో నరసమ్మ ఆసుపత్రికి వచ్చి సపర్యలు చేస్తోంది. అదే సమయంలో మనవరాలిని చూడటానికి రామయ్య కూడా ఆసుపత్రికి వచ్చాడు.ఆదివారం ఆసుపత్రి ప్రాంగణంలో రామయ్య భార్యను మాట్లాడాలని పిలిచి, ప్రసూతి వార్డు గేటు వద్ద కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు.
తీవ్రంగా గాయపడిన నరసమ్మను ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు రామయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















