హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల చిన్న వ్యాపారులకు భారంగా మారుతున్న నేపథ్యంలో ఓ చిరు వ్యాపారి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. సమోసా తయారీదారుడైన హుస్సేన్ అనే వ్యాపారి తన హోటల్ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థను అభివృద్ధి చేశారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో, ఆ ఖర్చును తగ్గించుకునేందుకు ఆయన డీజిల్‌తో పాటు వాడేసిన ఇంజిన్ ఆయిల్‌ను కలిపి ఉపయోగించే ప్రత్యేక బర్నర్ వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా స్టాండ్‌ను తయారు చేయించగా, 5 లీటర్ల సామర్థ్యం ఉన్న డబ్బా నుంచి పైపుల ద్వారా డీజిల్, ఆయిల్ మిశ్రమం బర్నర్‌కు చేరుతుంది.
అదే సమయంలో విద్యుత్ మోటార్‌తో పనిచేసే బ్లోయర్ నుంచి వచ్చే గాలి మరో పైపు ద్వారా బర్నర్ వద్దకు చేరడంతో మంట ఏర్పడుతోంది. ఈ మొత్తం వ్యవస్థను తయారు చేయడానికి సుమారు రూ.12 వేలు ఖర్చయిందని హుస్సేన్ తెలిపారు.
సాధారణంగా తన వ్యాపారానికి ప్రతి రెండు రోజులకు ఒక వాణిజ్య గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుందని, దాని ధర రూ.3,300 వరకు ఉండగా బ్లాక్ మార్కెట్‌లో రూ.6 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని చెప్పారు. ఈ భారం తట్టుకోలేక రోజుకు సుమారు ఐదు లీటర్ల డీజిల్, ఐదు లీటర్ల వాడేసిన ఆయిల్ కొనుగోలు చేస్తున్నానని, ఇందుకు సుమారు రూ.750 మాత్రమే ఖర్చవుతోందని వివరించారు.
తక్కువ ఖర్చుతో హోటల్ నిర్వహణ కొనసాగించేందుకు తీసుకున్న ఈ వినూత్న ప్రయత్నం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















