అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్‌ల రిఫండ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రిఫండ్‌గా ఇది నిలుస్తోంది. Donald Trump విధించిన టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫిబ్రవరి 20న ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిఫండ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 5.3 కోట్ల షిప్‌మెంట్లకు సంబంధించిన 3.3 లక్షల మంది దిగుమతిదారులు సుమారు 166 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15.44 లక్షల కోట్లు) టారిఫ్‌ల రూపంలో చెల్లించినట్లు సమాచారం.
రిఫండ్ కోసం ఇప్పటివరకు 56,497 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. కొత్త కేప్ (Consolidated Administration and Processing of Entries) వ్యవస్థ ద్వారా షిప్‌మెంట్లు, చెల్లింపుల వివరాలు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అన్ని ధృవీకరణలు పూర్తయిన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో వడ్డీతో సహా రిఫండ్ అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ రిఫండ్ మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వాలనే నిబంధన లేకపోవడంతో కంపెనీలకు ప్రత్యక్ష లాభం లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని డెలివరీ సంస్థలు, ముఖ్యంగా ఫెడెక్స్ వంటి సంస్థలు, రిఫండ్ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తామని ప్రకటించాయి.మొత్తంగా ఈ టారిఫ్ రిఫండ్ ప్రక్రియ అమెరికా వాణిజ్య చరిత్రలో ఒక కీలక ఆర్థిక పరిణామంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















