మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతోపాటు మొత్తం రూ.1.37 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. శిక్ష పడిన వారిలో ఎనిమిది మంది బంగ్లాదేశ్‌కు చెందినవారున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
2019 సెప్టెంబరులో బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చిన వ్యవహారంపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగాలు, మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి భారత్‌కు తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు అధికారులు గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా జల్‌పల్లిలోని ఓ వ్యభిచార గృహంపై పహాడీ షరీఫ్ పోలీసులు దాడి చేశారు. అక్కడ ముగ్గురు బంగ్లాదేశ్ మహిళలకు విముక్తి కల్పించారు. అలాగే బాలాపూర్‌లోని మహమూద్ కాలనీలో ఓ ఇంటి నుంచి మరో మహిళను రక్షించారు.
తదుపరి ఈ కేసును ఎన్‌ఐఏ అధికారులు రీ-రిజిస్టర్ చేసి దర్యాప్తును కొనసాగించారు. దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో పలువురు నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 12 మందిపై 2020 అక్టోబర్ 17న ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వారిలో 9 మందికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















