హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడి సహజీవనం చేసిన యువకుడు.. తాను గర్భం దాల్చానని, పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కాడు. బాలాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలాపూర్ బిస్మిల్లా కాలనీకి చెందిన సాలం సయీద్ కుమారుడు సాలం అహ్మద్ (21) షాహిన్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం బిహార్ నుంచి వచ్చిన ఇషాఖ్ కుటుంబం కూడా అదే కాలనీలో నివసిస్తోంది. ఆయన కుమార్తె రెహానా ఖాతూన్ (20) అదే ఫంక్షన్‌హాల్‌లో రోజువారీ కూలీగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో అహ్మద్, రెహానా మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రెహానా పలుమార్లు పెళ్లి చేసుకోవాలని కోరినా అహ్మద్ విషయం దాటవేస్తూ వచ్చాడు.
ఆదివారం అహ్మద్ నివాసంలో ఇద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. తాను రెండో నెల గర్భంతో ఉన్నానని, పెళ్లికి అంగీకరించకపోతే విషయం బయటపెడతానని రెహానా స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున కత్తితో రెహానాపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఆమె కడుపులో ఏడుసార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హత్య అనంతరం రెహానా మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టిన అహ్మద్.. దానిని చెరువులో పడేసి ఆధారాలు లేకుండా చేయాలని భావించాడు. అయితే మృతదేహాన్ని ఒంటరిగా మోసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో తన తల్లి అయేషా సాయం కోరినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ఫంక్షన్‌హాల్‌లో పనిచేసే ఓ బంధువుకు కూడా హత్య విషయం చెప్పి, ఆనవాళ్లు లేకుండా చేయడంలో సహకరించాలని కోరాడు. అయితే అతడు పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















