Type / toభారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, గ్రౌండ్ పరికరాలను దుర్వినియోగం చేసినందుకు లెవల్-1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద జయసూర్యను మందలించింది. దీంతో పాటు అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ జత చేసింది.
మ్యాచ్ రెండో రోజు చివరి బంతికి జయసూర్య ఔటయ్యాడు. అంతకుముందు వెలుతురు సరిగ్గా లేదంటూ అంపైర్లతో అతడు వాగ్వాదానికి దిగాడు. చివరి బంతికి ఔటైన తర్వాత కూడా అతడి అసహనం తగ్గలేదు. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో పలుమార్లు వెనక్కి తిరిగి అంపైర్ల వైపు ఆగ్రహంగా చూశాడు.
అంతేకాకుండా బౌండరీ వద్ద ఉన్న మార్కర్లను బ్యాట్‌తో కొట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న తర్వాత తన గ్లౌజ్‌లను కూడా విసిరేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఇతర సామగ్రిని దుర్వినియోగం చేయడాన్ని ఐసీసీ నిబంధనల ప్రకారం తప్పిదంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 కింద జయసూర్యపై చర్యలు తీసుకున్నారు.
తొలి తప్పిదం కావడంతో..
జయసూర్య తన తప్పును అంగీకరించాడు. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన శిక్షను కూడా అతడు అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే వ్యవహారం ముగిసింది. గత 24 నెలల్లో ఇది జయసూర్య చేసిన తొలి తప్పిదం కావడంతో అధికారిక మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌తో ఐసీసీ చర్యలను ముగించింది.
ఇదిలా ఉండగా.. ఇదే టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇద్దరు ఆటగాళ్లపైనా ఐసీసీ చర్యలు తీసుకుంది. జైస్వాల్, ఫెర్నాండోకు చెరో 25 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. choose a block
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















