పురుషుల హాకీ ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు నీలం రంగులో కనిపించిన భారత పురుషుల, మహిళల జాతీయ జట్ల జెర్సీలను తాజాగా కాషాయం రంగులోకి మార్చారు. ఈ మార్పుపై విమర్శలు రావడంతో హాకీ ఇండియా స్పందిస్తూ, జెర్సీ రంగు మార్పు వెనుక రాజకీయ కారణాలు లేవని, పూర్తిగా సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు జరిగే బ్లూ సింథటిక్ మైదానాల్లో నీలం జెర్సీలు ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించడంలో కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయని హాకీ ఇండియా తెలిపింది. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో చర్చించిన అనంతరం పసుపు, కాషాయం వంటి ప్రత్యామ్నాయ రంగాలను పరిశీలించి చివరకు కాషాయాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొంది.
భారత జాతీయ పతాకంలోని ముఖ్యమైన రంగుల్లో ఒకటైన కాషాయం ధైర్యం, త్యాగం, జాతీయ గౌరవానికి ప్రతీక అని హాకీ ఇండియా వివరించింది. సాంకేతికంగా కూడా మైదానంలో ఆటగాళ్లు స్పష్టంగా కనిపించేందుకు ఈ రంగు అనుకూలంగా ఉంటుందని తెలిపింది.
భారత హాకీ జట్టు జెర్సీ రంగు మారడం ఇదే తొలిసారి కాదని హాకీ ఇండియా గుర్తుచేసింది. 2014 ప్రపంచకప్‌లో పసుపు రంగు, 2018 ప్రపంచకప్‌లో స్కై బ్లూ రంగు జెర్సీలను ఉపయోగించిన విషయాన్ని ప్రస్తావించింది.
ఈ ఏడాది పురుషుల హాకీ ప్రపంచకప్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. పూల్ డిలో ఉన్న భారత్ ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా, ఆ తర్వాత ఇంగ్లాండ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 2023 ప్రపంచకప్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ 1975లో ఒక్కసారి మాత్రమే విజేతగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















