దేశ పారిశ్రామిక, వ్యాపార, కార్పొరేట్ రంగాల్లో ప్రభావం చూపుతున్న మహిళలకు మరోసారి గుర్తింపు లభించింది. 2026 క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితాలో మొత్తం 117 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. గతేడాది 97 మంది ఉండగా.. ఈసారి వారి సంఖ్య 21 శాతం పెరిగింది.
ఈ జాబితాలో స్థానం పొందిన మహిళలు నాయకత్వం వహిస్తున్న సంస్థల ఎంటర్‌ప్రైజ్ విలువ, మార్కెట్ క్యాపిటలైజేషన్, సంపద కలిపి సుమారు రూ.39 లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం ఫిన్లాండ్ జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. గత ఏడాది 9 విభాగాలతో రూపొందించిన జాబితాను ఈసారి 12 విభాగాలకు విస్తరించారు.జాబితాలోని మహిళల్లో 84 శాతం మంది స్వశక్తితో ఎదిగినవారే కావడం మహిళా నాయకత్వంలో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తోంది. ‘వెల్త్ మల్టీప్లయర్స్’ విభాగంలో హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానంలో నిలిచారు. ఆమె నెట్‌వర్త్ రూ.2.84 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.
‘ప్రొఫెషనల్ సీఈఓ’ విభాగంలో హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. ‘వెటరన్స్’ విభాగంలో అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ‘న్యూ ఎకానమీ’ విభాగంలో రెన్యూ పవర్ సహ వ్యవస్థాపకురాలు వైశాలి నిగమ్ సిన్హా ప్రథమ స్థానంలో ఉన్నారు.
ఈ జాబితాలో చోటు పొందిన వారి సగటు వయసు 48 సంవత్సరాలు కాగా.. 19 నుంచి 86 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఇందులో ఉన్నారు. వ్యాపారం, పరిశ్రమలు, ప్రొఫెషనల్ నాయకత్వం వంటి విభిన్న రంగాల్లో మహిళల ప్రాభవం పెరుగుతున్న తీరును ఈ జాబితా చాటిచెబుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















