రష్యా సాయుధ దళాల్లో చేరిన భారతీయులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలను వెల్లడించింది. ఇప్పటివరకు 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు సమాచారం ఉందని, వారిలో 139 మందిని విధుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. దురదృష్టవశాత్తూ 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటన నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో మిస్రీ ఈ వివరాలు వెల్లడించారు. రష్యా సాయుధ దళాల్లో ఉన్న భారతీయుల అంశాన్ని భారత్-రష్యా మధ్య వివిధ స్థాయుల్లో పలుమార్లు చర్చించినట్లు తెలిపారు.
రష్యా సైన్యంలో ఇంకా కొనసాగుతున్న భారతీయులను వీలైనంత త్వరగా విధుల నుంచి విడుదల చేయించి, స్వదేశానికి తీసుకురావడానికి మాస్కోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మిస్రీ చెప్పారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు.
భారతీయ పౌరుల విడుదల, స్వదేశానికి తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రష్యా అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారతీయుల అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయుల భద్రత, విడుదల, స్వదేశానికి తరలింపు అంశాలపై భారత్ దౌత్యపరమైన చర్యలు కొనసాగిస్తోంది
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















