భారత్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక జలాంతర్గామి ‘మత్స్య 6000’ ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సముద్ర పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ప్రారంభ దశలో ఈ సబ్‌మెర్సిబుల్ 500 మీటర్ల లోతుకు వెళ్లి మనుషులతో కలిసి సముద్ర పరిశోధనలు నిర్వహించనుందని ఆయన వెల్లడించారు.
ఈ పరీక్షల ద్వారా లభించే ఫలితాలను విశ్లేషించిన అనంతరం, వచ్చే ఏడాది దీన్ని 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. సముద్రంలోని ఖనిజ వనరుల అంచనా, సమగ్ర సముద్ర విశ్లేషణ, అలాగే సాగర గర్భ పర్యాటక సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాజెక్టు కీలక సమాచారం అందించనుందని చెప్పారు. అంతేకాకుండా సముద్ర జీవుల ప్రత్యేక లక్షణాలు, నీటి స్వభావం వంటి అంశాలపై శాస్త్రవేత్తలకు కొత్త అవగాహన లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సముద్ర అన్వేషణ రంగంలో భారత్ కొత్త దిశలో అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఒకేసారి సముద్ర గర్భంలోకి వెళ్లేలా ఈ జలాంతర్గామిని ప్రత్యేకంగా రూపొందించారు. వారికి అవసరమైన ఆక్సిజన్ కోసం 61 సిలిండర్లను ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్త, ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణన్ వివరించారు.
ఈ ప్రాజెక్టును సుమారు ఐదేళ్ల క్రితం ప్రారంభించగా, ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నట్లు తెలిపారు. జలాంతర్గామిని అందులోని సిబ్బందే పూర్తిగా నియంత్రించగలిగేలా రూపొందించారని, ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా ఇప్పటికే పూర్తిచేసినట్లు చెప్పారు. ఒకేసారి 12 గంటల పాటు నిరంతర పరిశోధనలు నిర్వహించే సామర్థ్యంతో ‘మత్స్య 6000’ను డిజైన్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















