ప్రముఖ హీరో Prabhas ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. గుర్రపు స్వారీతో కూడిన కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆయన కింద పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చేతికి చిన్న గాయం అయ్యిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారీ అంచనాల మధ్య ‘ఫౌజీ’
‘ఫౌజీ’ చిత్రానికి Hanu Raghavapudi దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ విభిన్న అవతారంలో కనిపిస్తారని టాక్. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అంశాల మేళవింపుతో కథ నడుస్తుందని సమాచారం.
ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో
మిథున్ చక్రవర్తి ,అనుపమ్ ఖేర్, జయప్రద ,భానుచందర్, తదితరులు కనిపించనున్నారు
దసరా కానుకగా విడుదల
చిత్రబృందం తెలిపిన వివరాల ప్రకారం, విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదల చేసే ప్రణాళిక ఉంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ ప్రమోషన్లు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అభిమానుల్లో ఆందోళన – త్వరగా కోలుకోవాలని ఆశలు
ప్రభాస్‌కు గాయం అయ్యిందన్న వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ డార్లింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. గాయం పెద్దది కాదన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ కొంత ఊరట పొందారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















