ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అంతర్జాతీయ కథనాలు సంచలనంగా మారాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయనకు కాలికి గాయం కావడంతో పాటు ముఖానికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం వెలువడింది.
ఈ గాయాల కారణంగా ఆయనకు ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగాయని, కాలికి కృత్రిమ అవయవం అమర్చే అవకాశాలు ఉన్నాయని కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే ముఖ గాయాల తీవ్రత కారణంగా ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉండొచ్చని కూడా తెలుస్తోంది.
ప్రస్తుతం మొజ్తాబా ఖమేనీని రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. భద్రతా కారణాల వల్ల ఆయనను ఎవ్వరూ నేరుగా కలవడం లేదని, కమ్యూనికేషన్ కోసం చేతితో రాసిన సందేశాలు మాత్రమే ఉపయోగిస్తున్నారని కథనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆయన దేశ పాలన కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది. సైనిక ఉన్నతాధికారులు, రివల్యూషనరీ గార్డ్ సభ్యులు కలిసి యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















